కరోనా అటాక్.. ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు

by Sumithra |
కరోనా అటాక్.. ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లా కోయిలీబేడా పీఎస్ పరిధిలో మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోయారు. కామ్ తేడా బీఎస్‌ఎఫ్ క్యాంపులో ఇద్దరు మావోయిస్టులు కరోనా భయంతో ఆయుధాలతో సహా పోలీసుల ఎదుట లొంగిపోయారు. సరెండర్ అయిన వారిలో ఒకరు మహిళా మావోయిస్టు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఇటీవల మన్యంలోని మావోయిస్టులు కరోనా బారిన పడ్డారని తెలిసిందే. గుట్టచప్పుడు కాకుండా అడవిలోనే వీరికి చికిత్స అందిస్తున్నారు. అయితే, కరోనా బారిన పడిన మావోయిస్టులు లొంగిపోతే వారికి సకాలంలో ట్రీట్మెంట్ అందిస్తామని పోలీసులు వెల్లడించారు.

Advertisement

Next Story