వరద నీటిలో సాహసం.. తండ్రి, కొడుకు మృతి

by Sridhar Babu |
వరద నీటిలో సాహసం.. తండ్రి, కొడుకు మృతి
X

దిశ, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో భారీ వర్షం, వరదలు విషాదాన్ని నింపాయి. గొల్లపల్లి మండలం మల్లన్నపేట వాగులో పడి తండ్రి, కొడుకులు గల్లంతు అయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. నందిపల్లికి చెందిన గంగమల్లు అతని కుమారుడు విష్ణుతో కలిసి స్వగ్రామం నుంచి మల్లన్నపేటకు బయల్దేరారు. అప్పటికే భారీ వర్షంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మార్గమధ్యలో ఉన్న మల్లన్నపేట వాగు కూడా వంతెన మీదుగా ప్రవహిస్తున్నది. అయినప్పటికీ సాహసం చేసిన గంగమల్లు బైక్‌తో వరద నీటిని దాటేందుకు ప్రయత్నించాడు. కానీ, ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో బైక్ అదుపు తప్పి వాగులో పడిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు తండ్రీకొడుకుల కోసం గాలింపు చేపట్టగా తొలుత విష్ణు(6) మృతదేహం లభ్యం అయింది. మంగళవారం మధ్యాహ్నం గంగమల్లు మృతదేహాన్ని కూడా వెలికితీశారు. ఒకే కుటుంబంలో ఇద్దరు చనిపోవడంతో భార్య, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Next Story

Most Viewed