పాక్ ఆర్మీ కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి

by Shamantha N |

శ్రీనగర్: ప్రపంచమంతా కరోనాపై పోరాడుతుంటే పాక్ ఆర్మీ మాత్రం తన వక్రబుద్ధిని బయటపెడుతోంది. నియంత్రణ రేఖ వెంబడి తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. శుక్రవారం సాయంత్రం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లకు తీవ్ర గాయాలవ్వగా, వీరు చికిత్స పొందుతూ శనివారం మృతిచెందారు. బారాముల్లా జిల్లాలోని రాంపూర్ సెక్టార్‌లో ఈ ఘటన జరిగిందని ఆర్మీ అధికార ప్రతినిధి కల్నల్ రాజేష్ ఖాలియా వెల్లడించారు. ఏప్రిల్ 29, 30 తేదీల్లో కూడా పూంచ్ సెక్టార్ ప్రాంతాల్లో పాక్ ఆర్మీ మోటార్ షెల్స్‌తో కాల్పులకు తెగబడిందని ఆర్మీ అధికారులు తెలిపారు.

Tags: pak army, LOC, two jawans dead, rampur sector, jammu kashmir

Advertisement

Next Story