- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
చెదిరిన కల.. కాలి బూడిదైన నాలుగు లక్షల కరెన్సీ
దిశ, నల్లగొండ: ఇల్లు కట్టుకోవాలన్న ఎన్నో ఏండ్ల కల కలగానే మిగిలిపోయింది. ఎప్పటికైనా సొంతింట్లో నివసించాలన్న వారి అడియాశలయ్యాయి. నోటికాడి ముద్ద నేలపాలైనట్టు.. బ్యాంకు నుంచి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్న డబ్బులు బుగ్గిపాలయ్యాయి. గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇళ్లు పూర్తిగా దగ్ధమై.. కరెన్సీ నోట్లు పూర్తిగా కాలి బూడిద అయ్యాయి. ఈ ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం అవంతిపురం గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. గ్రామానికి చెందిన దుగ్యాల సుజాత ఇంట్లో మొదట గ్యాస్ సిలిండర్ పేలి గుడిసె కాలిపోగా, పక్కనే ఉన్న దుగ్యాల మల్లమ్మ ఇంటికి కూడా మంటలు అంటుకుని రెండు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. కొత్త ఇల్లు కట్టుకోవడానికి బ్యాంకు నుంచి డబ్బులు తెచ్చుకున్నామని, అవి పూర్తిగా కాలిపోయాయని బోరున విలపించారు. ఇంట్లో 4 లక్షల నగదు, ఆరు తులాల బంగారం, 30 తులాల వెండి, బియ్యం, వంటసామాన్లు పూర్తిగా దగ్ధమయ్యాయని బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.