తాళాలు పగలకొట్టి.. రెండు పడకల ఇండ్లు స్వాధీనం

by Sampath |   ( Updated:2021-06-09 05:06:43.0  )
తాళాలు పగలకొట్టి.. రెండు పడకల ఇండ్లు స్వాధీనం
X

దిశ, జనగామ: ఆధికారులు, ప్రభుత్వ ఆలస్యంతో నిరాశకు గురైన రెండుపడకల లబ్దిదారులు ఇండ్ల తాళాలు పగలకొట్టి ఇండ్లు స్వాధీనం చేసుకున్న సంఘటన బుధవారం జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై వివరాలిలా ఉన్నాయి. జిల్లా ఏర్పాటు తరుణంలో సూర్యాపేట రోడ్డులో గల ఏసీరెడ్డి కాలనీవాసులు నివాసముంటున్న ఇండ్ల స్థలంలో నూతన కలెక్టర్ కార్యాలయం నిర్మాణముకు గతంలో చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఇక్కడ నివాసముంటున్న కాలనీ వాసులకు ప్రభుత్వం రెండు పడకల ఇండ్లను నిర్మాణం చేపట్టి అందిస్తామని, ఇండ్ల నిర్మాణం పూర్తి చేపట్టినప్పటికి అధికారులు, ప్రభుత్వం చేపడుతున్న నిర్లక్ష్యం వల్ల అసలైన లబ్దిదారులకు ఇండ్లు రాకుండా పోతాయనే భయంతో పాటు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కిరాయికి ఉంటున్న ఇండ్లకు అద్దె కట్టలేని పరిస్థితులు ఉన్నాయని ఏసీరెడ్డి కాలని వాసులు నిర్మాణం పురైన ఇండ్ల వద్ద ఆందోళన చేట్టారు.

అయినప్పటికి అధికారులు స్పందించకపోవడంతో వారికివారే ఇండ్ల తాళాలను పగలకొట్టి ఇండ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమై కాలనీ వాసులకు నచ్చచేప్పగా ఫలితం లేకుండాపోయింది. దీంతో డబుల్ బెడ్రూమ్స్ నిర్మాణాశాఖ అధికారి ఘటనాస్థలికి చేరుకుని ఎవరూ ఆందోళన చెందవద్దని, డబుల్ బెడ్స్ రూమ్స్ వద్ద త్రాగు నీటి సమస్య ఉన్నందున ఆలస్యం అయిందన్నారు. సమస్యలను పూర్తి చేసి త్వరలోనే ఇండ్లను అందిస్తామని చెప్పారు. అయినప్పటికీ ఏసిరెడ్డి నగర్ వాసులు వినకుండా ఇండ్లలో ఉండేందుకు సిద్ధపడి ఇండ్లను స్వాధీన పర్చుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed