- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశంలో రెండు కరోనా మరణాలు
దిశ, వెబ్‌డెస్క్: మన దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అలాగే, వైరస్ బారిన పడి కోలుకున్నవారి సంఖ్యా పెరుగుతున్నది. అయితే, ఈ వైరస్ మూలంగా మరణాలు మాత్రం తక్కువగానే ఉన్నాయి. రాష్ట్రాలవారీగా రిపోర్టులను చూస్తే దేశంలో మొత్తం 91 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. అయితే, హెల్త్ మినిస్ట్రీ మాత్రం ఇప్పటివరకు 82 కరోనా కేసులను నిర్ధారించింది. కాగా, ఈ వైరస్ బారినపడి మనదేశంలో ఇప్పటివరకు ఇద్దరు మరణించారు. ఢిల్లీలో 70 ఏళ్లుపైబడిన ఓ వృద్ధుడు, కర్ణాటకలో 76ఏళ్ల వృద్ధురాలు ఈ వైరస్ లక్షణాలతో మరణించారు. కాగా, ఈ వైరస్ బారిన పడి కోలుకున్నవారి సంఖ్య పదికి పెరిగింది.
ఈ వైరస్ గురించి మారుమూల గ్రామాల్లోనూ భయభ్రాంతులు నెలకొన్నాయి. వాస్తవ సంఖ్య కంటే అధికంగా కరోనావైరస్ బారిన పడినట్టుగా ప్రచారాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ పాజిటివ్ కేసులను రాష్ట్రాలవారీగా పరిశీలిద్దాం. తెలంగాణలో ఒక్కరికి, ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కరికి ఈ వైరస్ సోకినట్టు హెల్త్ మినిస్ట్రీ పేర్కొంది. కేరళలో 19 మందికి, మహారాష్ట్రలో 14 మందికి, ఢిల్లీలో ఏడుగురికి, కర్ణాటకలో ఆరుగురికి, పంజాబ్‌లో ఒకరికి, తమిళనాడులో ఒక్కరికి, జమ్ము కశ్మీర్‌లో ఒక్కరు, లడాఖ్‌లో ముగ్గురికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారించారు. అలాగే, హర్యానాలో 14 మంది విదేశీయులకు, రాజస్తాన్‌లో ఒక భారతపౌరుడితోపాటు ఇద్దరు విదేశీయులకు, యూపీలో పది మంది భారతీయులకు, ఒక ఫారీనర్‌కు ఈ వైరస్ పాజిటివ్‌గా తేలింది.
ఈ వైరస్‌ను అరికట్టేందుకు ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించడం, విమానాశ్రయాల్లో ప్రీమెడికల్ స్క్రీనింగ్‌లు, ఎగుమతి-దిగుమతులపై ఆంక్షలు అమలు చేయడంతోపాటు, వైరస్ సోకినవారి నుంచి వ్యాప్తి చెందకుండా.. వైద్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నది. అలాగే, వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు పంజాబ్, హర్యానా, ఒడిషా, మధ్యప్రదేశ్, బీహార్‌లలో పాఠశాలలు, కాలేజీలు, సినిమా హాల్స్‌ను మూతపడ్డాయి. మణిపూర్‌లోనూ స్కూల్స్‌కు సెలవులు ప్రకటించారు. కర్ణాటకలో మాల్స్, పబ్‌లు, థియేటర్లు, వేడుకలు, పెళ్లిలాంటి శుభకార్యాలపైనా నిషేధం విధించారు. మహారాష్ట్రలోనూ కొన్ని ప్రాంతాల్లో ఈ నెల 30వరకు జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్, సినిమా హాల్స్‌లను మూసివేయాల్సిందిగా ఆదేశాలు వచ్చాయి. యూపీలో ఈ నెల 22 వరకు పాఠశాలలు మూసివేశారు.
tags : coronavirus, spread, fatalities, india, covid 19