అమ్మానాన్న కోసం వెళ్తూ.. కన్న ప్రేమకు దూరమైన తండ్రి

by Shyam |   ( Updated:2021-07-31 05:30:17.0  )
అమ్మానాన్న కోసం వెళ్తూ.. కన్న ప్రేమకు దూరమైన తండ్రి
X

దిశ, అలంపూర్ : ఎంతో ఆనందంగా తన తండ్రితో కలసి నాన్నమ్మతాతయ్యలను చూడటానికి వెళ్తున్న ఇద్దరు చిన్నారులను మృత్యువు కబళించింది. కన్న పిల్లలతో కలిసి తన అమ్మానాన్నలను చూడటానికి వెళ్తున్న ఓ తండ్రికి కడుపుకోత మిగిలింది.. ఆ కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. ఈ విషాద సంఘటన శనివారం ఉదయం జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూరు చౌరస్తా సమీపంలో 44వ.నంబరు జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్లితే.. మనవపాడు మండలం‌లోని చెన్నిపాడు గ్రామంకు చెందిన రవికుమార్ గత కొంత కాలం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా కర్నూలు మండలం తాండ్రాపాడు గ్రామంలో తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. ఆయన శనివారం తాండ్రాపాడు గ్రామం నుంచి స్వంత గ్రామమైన చెన్నిపాడు గ్రామంకు తన ఇద్ధరు పిల్లలతో ద్విచక్రవాహనంపై బయలుదేరారు. 44వ నంబరు జాతీయ రహదారిపై పూల్లూరు టోల్ ప్లాజా సమీపంలో ఉత్తర ఫుడ్ వద్ద రోడ్డుపై రాంగ్ రూట్లో వస్తున్న ట్రాక్టర్‌ను తప్పించబోయే క్రమంలో వెనుక నుంచి వచ్చిన డీసీయం.. ద్విచక్ర వాహనంను ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు దీక్షిత్(9) హర్షిత(6) ట్రాక్టర్ కింద పడి మృతి చెందారు. తండ్రి రవి కుమార్‌కు తీవ్రమైన గాయాలయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed