- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కనీసం హాఫ్ సెంచరీ కొట్టని అభ్యర్థులు 29 మంది
దిశ ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తికాగా, రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే ప్రధాన పార్టీల అభ్యర్థులకు తోడు కొంతమంది స్వతంత్ర అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓట్లలో భారీగానే ఓట్లు దక్కాయి. కానీ ఇదే సమయంలో కనీసం 50 ఓట్లు పడని అభ్యర్థులు 29 మంది ఉండడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏడు రౌండ్లలో సాగిన లెక్కింపు ప్రక్రియలో కొన్ని రౌండ్లలో కనీసం ఒక్క ఓటును దక్కించుకోలేకపోయారు. ఓ ఇద్దరు అభ్యర్థులైతే.. ఏకంగా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఇదిలావుంటే.. ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో 71 మంది బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి గట్టి పోటీనిస్తున్న తీన్మార్ మల్లన్న స్వతంత్ర అభ్యర్థి కావడం అందరికీ సుపరిచితమే.