వరద ఉద్ధృతికి కాడెద్దులు మృతి

by Sumithra |
వరద ఉద్ధృతికి కాడెద్దులు మృతి
X

దిశ, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోహెడ్ మండలం మైసంపల్లి గ్రామానికి చెందిన భాషంపల్లి అశోక్ తన రెండు ఎద్దులను శుక్రవారం పొలంలోనే కట్టివేసి మేత వేసి వచ్చాడు.

తీరా శనివారం వచ్చి చూసే సరికి రెండు ఎద్దులు మృతి చెంది ఉన్నాయి. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పొలం సమీపంలోని యోయ తుమ్మెద వాగుకు భారీ వరద వచ్చింది. దీంతో రెండు ఎద్దులు మృతి చెందాయి. వీటి విలువ సుమారు రూ. లక్ష పైనే ఉంటుందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story