బాలీవుడ్‌లో బిగ్ ఫైట్.. వచ్చే ఏడాది డేట్ ఫిక్స్

by Shyam |
బాలీవుడ్‌లో బిగ్ ఫైట్.. వచ్చే ఏడాది డేట్ ఫిక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్‌లో భారీ పోరుకు రంగం సిద్ధమవుతోంది. ఇందులో ఎవరిని విజయం వరిస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇది ఏ రాజకీయ పోరో కాదు. ఇద్దరు బడా హీరోల మధ్య పోరు. ఈ పోరు ఏ కమిటీ అధ్యక్షపదవికో కాదండీ.. ప్రేక్షకులను మెప్పించేందుకు. బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ నటిస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’, సంజయ్ దత్ ప్రధాన పాత్రలో కనిపించనున్న ‘కేజీఎఫ్-2’ సినిమాలు ఒకే రోజు విడుదలకు సిద్ధమవుతున్నాయి. దీంతో ప్రేక్షకులంతా దీన్ని ఓ మహా రణరంగంగా భావిస్తున్నారు. అంచనాల విషయంలో కేజీఎఫ్ ఓ మెట్టు పైనేఉన్నా, లాల్ సింగ్ చద్దా కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే అమీర్ ఖాన్, కరీనా జంటగా నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయాలని భావించినా, దానిని ఇప్పుడు ఏప్రిల్‌14కు మార్చారు. ఇందులో పాన్ ఇండియా స్టార్ యాష్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. దీంతో కేజీఎఫ్2, లాల్ సింగ్ చద్దా మధ్య క్లాష్ వస్తోంది. మరి ఇందులో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.

Advertisement

Next Story