- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జర్నలిస్టులపై కక్ష పూరిత చర్య : టీడబ్ల్యూజేఎఫ్
దిశ, క్రైమ్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారనే కక్ష పూరిత చర్యలో భాగంగానే ముగ్గురు జర్నలిస్టులపై కేసులు బనాయించడాన్ని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య సోమవారం ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్యలు విమర్శించారు. ఈ సందర్భంగా వారు సంయుక్తంగా సోమవారం విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌కు కరోనా వచ్చిందనే వార్తను సాకుగా తీసుకుని కేసు నమోదు చేయడాన్ని జర్నలిస్టులపై ప్రభుత్వ వైఖరి అర్థమవుతోందని అన్నారు. ఈ చర్య అధికార పక్షంపై వార్తలు రాసే జర్నిలిస్టులను భయబ్రాంతులకు గురి చేయడమేనని అన్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఆదాబ్ హైదరాబాద్ ఎడిటర్ సత్యం, సబ్ ఎడిటర్ శివ, రిపోర్టర్ అనంచిన్ని వెంకటేశ్వరరావుపై నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.