ఆ రోజుల్లో కూడా ఎల్ఐసీ ఆఫీసులు ఓపెన్​

by M.Rajitha |
ఆ రోజుల్లో కూడా ఎల్ఐసీ ఆఫీసులు ఓపెన్​
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఎల్ఐసీ పాలసీ హోల్డర్ల సేవల విస్తరణకు సంస్థ ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. పాలసీదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఈనెల 29వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఎల్ఐసీ ఆఫీసులు పని చేయనున్నాయి. అధికారిక పని వేళల ప్రకారం జోన్‌లు, డివిజన్‌ల అధికార పరిధిలోని ఎల్ఐసీ కార్యాలయాలు సాధారణ కార్యకలాపాల కోసం తెరిచి ఉండనున్నాయి. ఈమేరకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఎల్ఐసీ ఆఫీసులు పనిచేయనున్నాయని ఆ సంస్థ తెలిపింది.

Next Story