- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలను మరోసారి రిజెక్ట్ చేసిన కేంద్రం

దిశ, తెలంగాణ బ్యూరో: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదాను కేంద్ర ప్రభుత్వం మరోసారి తిరస్కరించింది. జాతీయ ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్రం వెనక్కి పంపించేసింది. కృష్ణా జలాల వినియోగం అంశంలో ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉందని కేంద్రం స్పష్టం చేసింది. అయితే.. కోర్టులో వివాదం నడుస్తున్న క్రమంలో ఈ ప్రాజెక్టు టెక్నో ఎకనామిక్ రిపోర్టును పరిగణనలోకి తీసుకోలేమని కేంద్ర జలశక్తి శాఖ వెల్లడించింది. అందుకే తెలంగాణ చేసిన ప్రతిపాదనలను తిరిగి వెనక్కి పంపించినట్లు లోక్‌సభలో కేంద్రం స్పష్టం చేసింది. లోక్‌సభలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా విషయమై ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రశ్న అడిగారు. దానికి జలశక్తి శాఖ సహాయ మినిస్టర్ రాజ్ భూషన్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. కాగా.. 2022 సెప్టెంబర్‌లోనూ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జల సంఘానికి ప్రతిపాదనలు పంపించిందని గుర్తుచేసింది. అప్పటి రిక్వెస్ట్‌ను 2024లో తిప్పి పంపించినట్లు తెలిపింది.