ట్రెండింగ్: సమంతకు ట్విట్టర్ ప్రత్యేక గుర్తింపు

by Shyam |
ట్రెండింగ్: సమంతకు ట్విట్టర్ ప్రత్యేక గుర్తింపు
X

దిశ,వెబ్ డెస్క్: బ్యూటిఫుల్ హీరోయిన్ సమంతా అక్కినేని మల్టీ టాలెంటెడ్ అని ప్రూవ్ చేసుకుంది. ఇటు సినిమాలు, అటు బిజినెస్, మరో వైపు హోస్టింగ్ లో బిజీ అయిపోయిన భామ.. అన్నింట కూడా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. గ్లామరస్ టచ్ తో కుర్రకారు మనసు గెలుచుకున్న సామ్.. ఆ తర్వాత కేవలం సెలెక్టెడ్ క్యారెక్టర్స్ ప్లే చేస్తూ శభాష్ అనిపించుకుంది. ఎలాంటి పాత్ర అయినా ఈజ్ గా చేయగలదని గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే డిజిటల్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్న సామ్.. ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ లో మెయిన్ విలన్ గా పవర్ ఫుల్ రోల్ ప్లే చేయబోతోంది. ఫిబ్రవరి 12 నుంచి అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం కాబోతున్న సిరీస్ గురించి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తుండగా.. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు కూడా.

https://twitter.com/BajpayeeManoj/status/1352825117898797056?s=19

ఈ క్రమంలో సమంత అక్కినేనికి ప్రత్యేక గుర్తింపు ఇస్తూ ఈ సిరీస్ ప్రమోషన్స్ చేస్తుంది ట్విట్టర్. ది ఫ్యామిలీ మ్యాన్ 2 మెయిన్ లీడ్ మనోజ్ భాజ్ పాయి తో పాటు సామ్ క్యారెక్టర్ ఎమోజి కూడా యాడ్ చేసి ప్రమోషన్స్ కు యూజ్ చేస్తోంది. కాగా ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి ఘనత సాధించిన హీరోయిన్ గా సామ్ రికార్డ్ సృష్టించగా.. సిరీస్ లో తనది ఎంత పవర్ ఫుల్ రోల్ అనేది దీని ద్వారానే అర్థం అవుతుందంటూ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. కాగా సామ్ ఈ సిరీస్ లో టెర్రరిస్ట్ గా కనిపించనుంది.

Advertisement

Next Story