ఆ పదం ఉపయోగిస్తే.. ట్విట్టర్ బ్లాక్

by Shyam |
Memphis
X

దిశ, ఫీచర్స్: సోషల్ మీడియా ప్లాట్‌ఫాం మార్గదర్శకాల ప్రకారం యూజర్ తమ పోస్ట్‌లలో ద్వేషపూరిత పదాలను ఉపయోగించకుండా ట్విట్టర్ పరిమితం చేస్తుందన్న విషయం తెలిసిందే. ఆయా పదాలను ట్వీట్ చేయడం వల్ల ఖాతా తాత్కాలికంగా లేదా శాశ్వతంగా నిలిపివేస్తారు. అయితే ఇటీవల ట్వీపుల్స్(ట్విట్టర్ యూజర్స్) ఒక నిర్దిష్ట పదాన్ని ఉపయోగించారు. ఆ ట్వీట్ చేసిన అనేక ఖాతాలు ఇటీవల బ్లాక్ అయిపోయాయి. గత వారం అలా ఎన్నో లక్షల అకౌంట్లు బ్లాక్‌లిస్ట్‌లోకి చేరాయట. ఇంతకీ ఆ పదం ఏంటీ? ఎందుకలా జరుగుతుంది?

ఎంతోమంది ట్వీపుల్స్ అకౌంట్స్ బ్లాక్ చేయడానికి ‘మెంఫిస్’ అనే పదం కారణం. ఆ పదం టైప్ చేయగానే ఆ ట్వీట్‌ను డిలీట్ చేయాలని మెసేజ్ రావడంతో పాటు, ట్విటర్ అకౌంట్ కూడా నిలిచిపోతోంది. 12 గంటల పాటు ఆ సస్పెన్షన్ కొనసాగుతోంది. ఇక ‘మెంఫిస్’ పేరుతో అమెరికాలోని టెన్నెసే రాష్ట్రంలో ఓ ప్రధాన నగరం ఉండగా, డచ్‌కు చెందిన ఓ ఫుట్‌బాల్ ప్లేయర్ పేరు అదే కావడం విశేషం. ‘బగ్ ఫిక్సింగ్‌లో అనుకోకుండా జరిగిన పరిణామాల వల్ల అకౌంట్లు బ్లాక్ అవుతున్నాయి. బ్లాక్ అయిన అకౌంట్లను పునరుద్ధరించాం. దీనికి మేం క్షమాపణలు చెబుతున్నాం’ అని ట్విట్టర్ తన పోస్ట్‌లో పేర్కొంది.

Advertisement

Next Story