సన్నీ లియోన్ అరెస్ట్‌.. మంత్రి వార్నింగ్

by Shyam |   ( Updated:2021-12-27 07:46:12.0  )
సన్నీ లియోన్ అరెస్ట్‌.. మంత్రి వార్నింగ్
X

దిశ, సినిమా: బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్‌ను అరెస్ట్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. #ArrestSunnyLeone హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. లేటెస్ట్‌గా రిలీజైన సన్నీ ఆల్బమ్ ‘మధుబన్ మే రాధిక’ లిరిక్స్ హిందువుల మనోభావాలు కించపరిచేలా ఉన్నాయని ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో సన్నీ అండ్ టీమ్‌కు వార్నింగ్ ఇచ్చిన మధ్యప్రదేశ్ మినిస్టర్ నరోత్తమ్ మిశ్రా.. ఈ పాట లిరిక్స్ వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు. ఫస్ట్ టైమ్ కాబట్టి ముందుగానే చెప్తున్నామని, ఇంకోసారి రిపీట్ అయితే డైరెక్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామని హెచ్చరించారు. ఇక ఈ ఆల్బమ్‌పై మండిపడుతున్న నెటిజన్లు.. పోర్న్ స్టార్‌ను ఇండియాలో స్టార్‌గా మారిస్తే ఇలానే ఉంటుందంటున్నారు.

Advertisement

Next Story