- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండియా మ్యాప్ వివాదం.. ట్విట్టర్ ఎండీపై కేసు
దిశ, వెబ్‌డెస్క్: భారత పటాన్ని తప్పుగా ప్రదర్శించినందుకు ట్విట్టర్ ఎండీపై కేసు నమోదైంది. భజరంగ్ దళ్ నేత ప్రవీణ్ భాటి ఫిర్యాదు మేరకు ట్విట్టర్ ఇండియా చీఫ్ మనీశ్ మహేశ్వరితో పాటు న్యూస్ పార్టనర్‌షిప్ అధిపతి అమిత్రా త్రిపాఠిపైనా యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌లను వేరే దేశంగా ట్విట్టర్ చూపించడంపై తీవ్ర విమర్శలొచ్చాయి. నెటిజన్ల ఆగ్రహంతో కొన్ని గంటల్లోనే మ్యాప్‌ను ట్విట్టర్ తొలగించింది.
గత నవంబర్‌లో లేహ్‌ను చైనాలో అంతర్భాగంగా ట్విట్టర్ చూపింది. దీంతో ట్విట్టర్‌కు కేంద్ర ప్రభుత్వం అప్పట్లో తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అయినా ట్విట్టర్ తీరు మారకపోవడంపై కేంద్ర సీరియస్‌గా ఉంది. ఇటీవల కొత్త ఐటీ నిబంధనల విషయంలో కేంద్రం, ట్విట్టర్ మధ్య వార్ నడుస్తోన్న విషయం తెలిసిందే. కోర్టుల వరకు ఈ విషయం వెళ్లింది. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ట్విట్టర్‌ను కేంద్రం హెచ్చరించింది.