ట్విట్టర్ బాస్ తొలి ట్వీట్.. రూ. 21 కోట్లు

by Sujitha Rachapalli |   ( Updated:2021-03-23 08:04:04.0  )
ట్విట్టర్ బాస్ తొలి ట్వీట్.. రూ. 21 కోట్లు
X

దిశ, ఫీచర్స్ : సరిగ్గా పదిహేనేళ్ల క్రితం 2006 మార్చి 21న ట్విట్టర్ పిట్ట.. మైక్రోబ్లాగింగ్, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌గా నెట్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. పొట్టి సందేశాలతో, గట్టి మాటలతో చిన్నగా మొదలైన ఆ పిట్ట కూతలు.. నేడు వరల్డ్‌వైడ్ పాపులారిటీని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఆ బుల్లి పిట్ట కూతలు ఎన్నో సోషల్ వార్స్‌కు కేరాఫ్‌గా నిలిచాయి. 350 మిలియన్ల మంత్లీ యాక్టివ్ యూజర్లను కలిగి ఉన్న ట్విట్టర్‌ను అమెరికాకు చెందిన టెక్ ఎంటర్‌ప్రెన్యూర్స్ జాక్ డోర్సే, నోహ్ గ్లాస్, బిజ్ స్టోన్, ఇవాన్ విలియమ్స్‌లు కలిసి స్థాపించారు. ట్విట్టర్ వ్యవస్థాపకుల్లో ఒకరైన జాక్‌ డోర్సే ‘జస్ట్‌ సెట్టింగ్‌ అప్‌ మై ట్విటర్‌’ అంటూ 2006 మార్చి 21లో చేసిన తొలి ట్వీట్ ఈ రోజుకు15 ఏళ్లు కంప్లీట్ చేసుకుంది. కాగా ఈ ఫస్ట్ ట్వీట్‌ను జాక్‌ డోర్సే బై సెంట్‌ అనే కంపెనీకి చెందిన ‘వాల్యుయబుల్స్‌’ అనే వెబ్‌సైట్‌లో అమ్మకానికి పెట్టగా, కోట్ల రూపాయలకు అమ్ముడుపోవడం విశేషం.

ట్విట్టర్ బాస్ జాక్ డోర్సె చేసిన తొలి ట్వీట్.. పాపులర్ ట్వీట్లలో ఒకటి. నాన్-ఫంగబుల్ టోకెన్ (ఎన్‌ఎఫ్‌టీ) రూపంలో ఉండే ఈ ట్వీట్.. ఓ రకమైన ప్రత్యేక డిజిటల్ ఆస్తి కాగా బిట్‌కాయిన్ ఔత్సాహికుడైన డోర్సే తన ఎన్‌ఎఫ్‌టీ అమ్మకముంచిన వెబ్‌సైట్‌కు లింక్‌ను తొలిగా మార్చి 6న ట్వీట్ చేశాడు. మార్చి 9న మరో ట్వీట్‌ చేసిన డోర్సే, వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని బిట్‌కాయిన్‌గా మార్చుకుంటానని, ఆఫ్రికాలో కొవిడ్ -19 ప్రభావంతో ఉన్న ప్రజలకు విరాళంగా ఇస్తానని అందులో పేర్కొన్నాడు. ఈ ట్వీట్‌ను కొనుగోలు చేసేందుకు ఎంతోమంది ఆసక్తి చూపగా, తమ ఆక్షన్ అమౌంట్ కోట్ చేశారు. ఈ క్రమంలోనే సోమవారం 2.9 మిలియన్ డాలర్ల(సుమారు రూ.21 కోట్లు)కు బ్లాక్ చెయిన్ కంపెనీ బ్రిడ్జి ఓరాకిల్ సీఈఓ సీనా ఎస్టావీ దీన్ని సొంతం చేసుకున్నారు. డోర్సే డిటిటల్ సైన్‌తో పాటు ట్వీట్ మెటాడేటా, అది పోస్ట్‌ చేసిన సమయం వంటి వివరాలు ఇందులో ఉంటాయి. ఇక ప్రాధమిక అమ్మకం ద్వారా వచ్చే ఆదాయంలో 95% డోర్సేకి, సెంట్ సంస్థకు 5% కమిషన్‌గా వెళ్లనుంది.

https://dailybusinessgroup.co.uk/wp-content/uploads/2021/03/Dorsey-tweet-sold.png

Advertisement

Next Story

Most Viewed