షణ్నుకి అక్కడ ముద్దు పెట్టిన సిరి.. కెమెరాలున్నాయని తెలిసి..

by Anukaran |   ( Updated:2023-12-16 14:49:15.0  )
big boss
X

దిశ, డైనమిక్ బ్యూరో : బోర్ డమ్‌ను తొలగించేందుకు వచ్చిన బిగ్ బాస్ షో ఆశించినంతగా ప్రేక్షకులను అలరించలేక పోతోంది. గత సీజన్లతో పోల్చితే కంటెస్టులకు ఇచ్చే టాస్క్‌లు, గేమ్‌లు తగ్గిపోయాయి. అంతేకాదు కంటెస్టెంట్ల లవ్ ట్రాక్స్ కూడా లేకపోవడంతో షో మెప్పించలేకపోతోంది. ఇక షోలో బెస్ట్ త్రిమూర్తులుగా పేరుతెచ్చుకున్న షణ్ను, సిరి, జశ్వంత్‌లు ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఎంజాయ్ చేస్తున్నారు.

షణ్ను, సిరిలు ఇదివరకే ఫ్రెండ్స్ కావడం, కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేసిన విషయం తెలిసిందే. అందుకే షణ్నుని సిరి ఎంతో కేరింగ్‌గా చూసుకుంటోంది. ఈక్రమంలో గురువారం విడుదలైన బిగ్ బాస్ ప్రోమోలో సిరి, షణ్ను చేసిన పని అందరిని షాక్‌కు గురిచేస్తోంది. అందులో షణ్ను మాట్లాడుతూ.. ‘‘మానసికంగా డిస్ట్రబ్‌ అయినప్పుడు ఎమోషనల్‌గా అటాచ్‌ అయిపోతాం’ అని అనగానే సిరి నేను బాగానే ఉన్నా రా.. నీ వల్లే మెంటల్‌గా ఎక్కువ ఇబ్బంది పడుతున్నా’ అని అంటుంది. అయితే దూరం పెట్టుకో అని షణ్ను అంటాడు. అలా వారి మధ్య సంభాషణ జరిగిన కాసేపటికి షణ్ముఖ్‌ అరె.. నేను మాట్లాడనురా అదే బెస్ట్‌’ అని అంటాడు. దీంతో వెంటనే సిరి కుర్చీలో నుంచి లేచి షణ్నుకి నుదిటిపై ముద్దు పెట్టి వెళ్లిపోతుంది.
సిరి చేసిన పనికి షాక్ అయిన షణ్ను.. అరె ఏంట్రా ఇది అనుకొని కెమెరా వైపు చూసి ‘అంతా రికార్డు చేశారా? ఇక నాకు ఉంటుంది. అంటాడు.’’ దీనిపై నెట్టింట తెగ చర్చ నడుస్తో్ంది. వీరి మధ్య స్నేహం పెరిగి మరో స్టెప్ వేయబోతున్నారేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story