‘మల్లేశ్వరి పీజీ’తో సెక్స్ చేశా.. పనికొస్తాయని వీడియోలు తీశానన్న యువతి

by Sumithra |   ( Updated:2021-04-01 02:45:17.0  )
sex video case
X

దిశ, వెబ్‌డెస్క్ : కర్ణాటక మంత్రి రాసలీలల సీడీ కేసులో యువతి సంచలన విషయాలను వెల్లడించింది. సిట్ ముందు విచారణకు హాజరైన ఆమె.. మంత్రి పరిచయం, ఎక్కడ కలిసింది, ఎన్నిసార్లు రాసలీలలు సాగించింది, వీడియోలు ఎవరు తీశారో సవిరంగా వివరించింది. ఆమె సమాధానాలతో సిట్ బృందం సైతం షాక్ కు గురైంది. ఇంతకు ఆమె ఏం చెప్పిందంటే..

‘‘విధానసభకు వెళ్లిన మంత్రి రమేశ్ జార్కిహోళిని అక్కడే కలిశాను. ఆయన తన ఫోన్ నంబర్ ఇచ్చారు. దానిని ‘మల్లేశ్వరి పీజీ’ అని సేవ్ చేసుకున్నాను. ఈ క్రమంలో ఆయన తనకు సహకరించాలని కోరారు. తమ ప్రాంతంలో ఆయన బలమైన నేత కావడంతో ఎదిరించలేక పోయాను. మంత్రి నన్ను రెండు, మూడుసార్లు శారీరకంగా వాడుకున్నాడు. ఎప్పటికైనా పనికి వస్తాయని నేనే.. మంత్రితో శారీకంగా కలిసిన సమయంలో వీడియోలు తీశాను. ఈ విషయాన్ని మా అమ్మనాన్నలకు కూడా చెప్పలేదు. కానీ నా ఫ్రెండ్స్ శ్రవణ్, నరేష్ లకు ఆ వీడియో కాపీలను ఇచ్చాను. మరో కాపీని నా దగ్గరే దాచుకున్నాను’’ అని సిట్ ఎదుట ఆ యువతి వాంగ్మూలం ఇచ్చింది.

అయితే ఆ వీడియోలను ఎవరు బయటపెట్టారు? ఎందుకు బయట పెట్టరో ఆమె వివరించలేదు. వీడియోలు బయటపెట్టాలని ఆమెపై ఎవరు ఒత్తడి చేశారు?, ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లింది; ఆమెను ఇన్నిరోజులు కాపాడింది ఎవరు అనేది తేలాల్సి ఉంది. దీనిపై సిట్ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed