సుశాంత్‌ది హత్యే.. సోషల్ మీడియాలో నోట్

by Shyam |
sushanth
X

‘సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్య కాదు హత్య’ అంటూ ఓ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి కారణం మహేశ్ భట్, సల్మాన్ ఖాన్, సూరజ్ పంచోలి అంటూ పెద్ద స్క్రిప్ట్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. దీనిపై సీబీఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్స్.

జియా ఖాన్ సూసైడ్ కేసులో జరిగినట్లే.. సుశాంత్ ఆత్మహత్య కేసులోనూ సల్మాన్ ఖాన్ ఇన్వాల్వ్ అయ్యాడంటూ పోస్ట్‌లో పేర్కొనడం గమనార్హం. సూరజ్ పంచోలి వల్ల జియాఖాన్‌కు ప్రెగ్నెన్సీ రాగా, తను ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు కూడా సూరజ్ పంచోలి వల్లే సుశాంత్ మేనేజర్ దిశకు ప్రెగ్నెన్సీ వచ్చిందని.. ప్రశ్నిస్తే పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోలేదని సోషల్ మీడియా నోట్‌లో ఉంది. అయితే ఈ విషయాన్ని సుశాంత్‌తో షేర్ చేసుకున్న దిశకు తను సపోర్ట్ చేశాడని.. అదే విషయం తన ఫ్రెండ్ సందీప్ సింగ్, గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తికి చెప్పగా ఇద్దరూ నమకద్రోహం చేశారని ఉంది. సందీప్ సింగ్ ఈ మ్యాటర్‌ను సల్మాన్ ఖాన్ దగ్గర రీవీల్ చేస్తే.. రియా మహేశ్ భట్‌కు పూస గుచ్చినట్లు చెప్పిందని నోట్‌లో వివరించారు. అదే క్రమంలో దిశ సుశాంత్‌తో ఫోన్‌లో మాట్లాడుతుండగా వచ్చిన సూరజ్ పంచోలి.. తనను హత్య చేశాడని.. 14 అంతస్థుల బిల్డింగ్‌పై నుంచి తోసేశాడని రాశారు. ఈ విషయాన్ని బయటకు చెప్తే ఏం జరుగుతుందో తెలుసా? అని.. సల్మాన్ ఖాన్, మహేశ్ భట్ బెదిరించడం.. దిశకు న్యాయం చేయలేక ఒత్తిడికి లోనైన సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడనేది ఆ నోట్ సారాంశం. కాగా దీనిపై సీబీఐ ఎంక్వైరీ చేపట్టి, నిందితులకు శిక్ష పడేలా చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed