గురుకులంలో కరోనా కలకలం.. 28 మంది చిన్నారులకు పాజిటివ్

by Anukaran |   ( Updated:2021-11-21 09:28:34.0  )
గురుకులంలో కరోనా కలకలం.. 28 మంది చిన్నారులకు పాజిటివ్
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లా వైరాలోని బాలికల గురుకుల విద్యాలయంలో విద్యార్థులు 2 రోజులుగా కరోన వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారు. దీనిని గుర్తించిన పాఠశాల ప్రిన్సిపాల్ కొంతమంది విద్యార్థులకు కరోన పరీక్షలు చేయించారు. వారిలో ఇప్పటి వరకు 28 మందికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. వెంటనే విద్యార్థులను ప్రత్యేక గదులకు తరలించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

గురుకులంలోని అందరి విద్యార్థులకు వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా సోకిందని సమాచారం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురై పాఠశాలకు చేరుకుంటున్నారు. విద్యాసంస్థల్లో పాజిటివ్ కేసులు మళ్లీ నమోదు కావడంతో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది.

Advertisement

Next Story