- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇక నుంచి ట్వీట్లను షెడ్యూల్ చేసుకోవచ్చు!
దిశ, వెబ్‌డెస్క్: వినియోగదారులకు మరింత సౌకర్యాన్ని కల్పించే ఉద్దేశంతో ట్విట్టర్ ఒక సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. అదే షెడ్యూలింగ్. అంటే అచ్చం ఈమెయిల్ షెడ్యూల్ చేసుకున్నట్లుగానే చేయాలనుకున్న ట్వీట్లను షెడ్యూల్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ వల్ల సోషల్ మీడియా మేనేజర్లకు, న్యూస్ పబ్లికేషన్ సంస్థలకు చాలా ఉపయోగం కలగనుంది. ట్వీట్ ఏ రోజున, ఏ సమయానికి చేయాలో ఈ ఫీచర్ సాయంతో షెడ్యూల్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి డెస్క్‌టాప్ ట్విట్టర్ వెర్షన్‌లో కొంతమందికి ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
అయితే కేవలం బీటా వెర్షన్ మాత్రమేనా లేక ప్రపంచం మొత్తానికి ఈ ఫీచర్‌ను ట్విట్టర్ అందజేస్తోందా అనే విషయం మీద ఇంకా స్పష్టత లేదు. ప్రత్యేకంగా దీనికి బటన్ పెట్టి ఈ ఫీచర్ రోల్అవుట్ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే థ్రెడెడ్ రిప్లైలు, చెడు పోస్టులు చేసేవారికి హెచ్చరికలు జారీ చేసే ఫీచర్లను ట్విట్టర్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.