ఆ రెండు సంస్థల కస్టమర్లకు ఊరట

by vinod kumar |
ఆ రెండు సంస్థల కస్టమర్లకు ఊరట
X

చెన్నై: లాక్‌డౌన్‌ నేపథ్యంలో యమహా, టీవీఎస్ సంస్థలు తమ కస్టమర్లకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నాయి. వారెంటీ గడువులను పెంచుతున్నట్టు ప్రకటించాయి. లైఫ్‌ టైమ్‌ క్వాలిటీ కేర్‌ సౌకర్యాన్ని 60 రోజులు పొడిగిస్తున్నట్లు ఇండియా యమహా మోటార్‌ వెల్లడించింది. ఏప్రిల్‌ 15 వరకు ఉచిత సర్వీసు గడువును, జూన్‌ వరకు సాధారణ వారెంటీని పొడిగిస్తున్నట్లు తెలిపింది. అలాగే, మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 15 మధ్య ముగిసే వార్షిక మెయింటనెన్స్‌ కాంట్రాక్టులనూ జూన్‌దాకా పొడిగిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఇక టీవీఎస్ మోటార్స్ సైతం మార్చి, ఏప్రిల్‌ మధ్య ఉండే ఫ్రీ సర్వీస్‌ సదుపాయాన్ని జూన్‌ వరకు పెంచుతున్నట్టు తెలిపింది. ఈ మేరకు కస్టమర్ల సహాయార్థం 18002587111 అనే టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేసింది.

tags: TVS, Yamaha, motors, customers, warranty, life time quality care

Advertisement

Next Story