టీవీఎస్ లాభాల్లో 23 శాతం క్షీణత 

by Harish |
టీవీఎస్ లాభాల్లో 23 శాతం క్షీణత 
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద టూ-వీలర్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 23 శాతం క్షీణించి రూ. 196 కోట్లుగా నమోదు చేసింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ. 4,617 కోట్లుగా ఉంది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ. 4,353 కోట్లతో పోలిస్తే ఈసారి 6 శాతం అధికం. ఇక, రెండో త్రైమాసింలో టీవీఎస్ మోటార్ మొత్తం 8.34 లక్షల టూ-వీలర్ వాహనాలను విక్రయించింది.

గతేడాది ఇదే కాలంలో 8.42 లక్షల యూనిట్లను విక్రయించింది. ఈ త్రైమాసికంలో టూ-వీలర్ల ఎగుమతులు 7.8 శాతం పెరిగాయని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ త్రైమాసికంలో బైక్ అమ్మకాల్లో 8 శాతం వృద్ధి సాధించగా, స్కూటర్ అమ్మకాల్లో 16 శాతం క్షీణత నమోదైంది. సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ బైక్ అమ్మకాలు 3.66 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంలో 3.42 లక్షల యూనిట్ల విక్రయాలు జరిగాయి.

స్కూటర్ అమ్మకాలు 3.33 లక్షల యూనిట్ల నుంచి 2.7 లక్షల యూనిట్లకు తగ్గాయి. త్రీవీల అమ్మకాలు 33 వేల యూనిట్లు అమ్ముడవగా, గతేడాది ఇదే కాలంలో 43 వేల యూనిట్లు అమ్ముడయ్యాయి. ‘కొవిడ్-19 సవాళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రెండో త్రైమాసికంలో కంపెనీ సరఫరా గొలుసు బలంగా ఉంది. జులై తర్వాత ఉత్పత్తి, అమ్మకాలు స్థిరంగా మెరుగుపడ్డాయని టీవీఎస్ మోటార్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది.

Advertisement

Next Story