- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ద్విచక్ర వాహనదారులకు TVS షాక్..
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ తన స్కూటర్ పోర్ట్ ఫోలియోలోని 110 సీసీ టీవీఎస్ జూపిటర్ ధరలను పెంచింది. ఈ స్కూటర్ ప్రస్తుత మొత్తం 5 వేరియంట్లలో లభిస్తుండగా, వీటి ధరలను రూ. 736-రూ. 2,336 మధ్య పెంపును ప్రకటించింది. షీట్ మెటల్ వీల్ వేరియంట్ ధరను పెంచిన తర్వాత రూ. 65,673 ఉండగా, స్టాండర్డ్ మోడల్ రూ. 67,398, జెడ్ ఎక్స్ డ్రమ్ రూ. 71,973, జెడ్ఎక్స్ డిస్క్ ట్రిమ్ వేరియంట్ ధర రూ. 75,773కి కంపెనీ ధరలను పెంచేసింది. క్లాసిక్ మోడల్ ధర రూ. 75,743గా ఉంది.
ఈ స్కూటర్ ఇటీవల మార్కెట్లో మెరుగైన అమ్మకాలను సాధిస్తున్న మోడల్‌గా నిలిచిందని, ఇందులో ఎయిర్‌కూల్డ్ 109.7సీసీ ఇంజిన్ ఉందని కంపెనీ తెలిపింది. అలాగే, సరికొత్త టెక్నాలజీ ఎకోత్రస్ట్ ఫ్యుయెల్ ఇంజెక్షన్‌తో పనిచేస్తుందని, డిస్క్ డ్రమ్ కాంబో బ్రేకింగ్ వ్యవస్థ ఆప్షన్లను ఇస్తున్నట్టు కపెనీ పేర్కొంది. వీటితోపాటు మొబైల్ ఛార్జర్, ఫ్రంట్ యుటిలిటీ బాక్స్ లాంటి ఫీచర్లు కంపెనీ అందిస్తోంది. ముఖ్యంగా వాహనదారులకు సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవాన్ని అందించేందుకు ఇన్‌టెలిగో సాంకేతికతను ఇందులో వినియోగించినట్టు కంపెనీ వెల్లడించింది.