- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీహెచ్ఎంసీని సందర్శించిన టీవీసీసీ ఛైర్మన్
దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ వికలాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్ ఛైర్మన్ వాసుదేవరెడ్డి గురువారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, యూసీడీ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జీహెచ్ఎంసీ తరపున వికలాంగులకు అందించిన బ్యాంక్ లోన్లు, ట్రై సైకిళ్లు, చక్రాల కుర్చీల తదితర కార్యక్రమాల గురించి యూసీడీ విభాగం ప్రాజెక్టు డైరెక్టర్ సౌజన్య వివరించారు. వికలాంగులకు గుర్తింపు కార్డులను జారీ చేయడంతో పాటు వికలాంగుల డిమాండ్లను పరిష్కరించడానికి వివిధ విభాగాలను సమన్వయం చేస్తున్నట్టు పీడీ తెలిపారు. అనంతరం వాసుదేవరెడ్డి మాట్లాడుతూ గతేడాది పీడబ్ల్యూడీకి రూ.10 కోట్ల విలువైన ఆస్తులను కార్పొరేషన్ పంపిణీ చేసిందని, స్మార్ట్ ఫోన్లు, విద్యా ప్రమాణాల ఆధారంగా ల్యాప్‌టాప్‌లను కూడా అందిస్తున్నట్లు తెలిపారు. టీవీసీసీ ద్వారా వీలైనంత ఎక్కువ మంది ప్రజలకు ప్రయోజనం కలిగేలా చూడాలని డిప్యూటీ మేయర్‌ను కోరారు.