పిల్లల చదువు కోసం.. ఓ తల్లి వింత నిర్ణయం

by Shamantha N |
పిల్లల చదువు కోసం.. ఓ తల్లి వింత నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: పిల్లల చదువు కోసం ఓ తల్లి ఏకంగా తన మంగళసూత్రాన్ని తనఖాపెట్టి టెలివిజన్ కొనుగోలు చేసింది. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగుచూసింది. కరోనా నేపథ్యంలో ఆగస్టు నెల సమీపించినా స్కూళ్లు తెరువని పరిస్థితి. ఈ నేపథ్యంలో ద్రుశ్యశ్రవణ మాధ్యంలో తరగతులు నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది.

దీంతో గడగ్‌కు చెందిన కస్తూరి అనే మహిళ తన పిల్లల చదువు కోసం ఎంతో పవిత్రంగా భావించే మంగళసూత్రాన్ని తనఖా పెట్టి టీవీ కొనుగోలు చేశారు. ఆన్‌లైన్ తరగతుల కోసం టీవీ కొనాలని టీచర్లు చెప్పారని, తమ వద్ద డబ్బు లేకపోవడంతో మంగళసూత్రం తాకట్టు పెట్టి కొన్నట్లు ఆమె వెల్లడించారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో పిల్లలను రోజూ పొరుగువారి ఇంటికి పంపించలేని పరిస్థితిలో ఇలా చేయాల్సి వచ్చిందని ఆ తల్లి జవాబిచ్చింది.

Advertisement

Next Story