- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
శునక గౌరవార్థం.. నేషనల్ హాలీడే
దిశ, వెబ్‌డెస్క్: తుర్క్‌మెనిస్థాన్ దేశాధినేత గుర్బంగులి బెర్డిముఖమెదోవ్స్‌కి కుక్కలంటే చాలా ఇష్టం. సెంట్రల్ ఏషియాలో దొరికే ‘అలబాయ్’ అనే అరుదైన డాగ్ బ్రీడ్ అంటే ఆయనకు మహా మక్కువ. అందుకే ఆ జాతి కుక్కల స్మృతిగా శునక విగ్రహాన్ని బంగారంతో చేయించి దేశ రాజధాని యాష్గబట్‌లోని ప్రధాన కూడలిలో ప్రతిష్ఠించిన విషయం తెలిసిందే. ఇటీవల గుర్బంగులి మరో అడుగు ముందుకేశారు. ‘అలబాయ్’ జాతి కుక్కల గౌరవార్థం ‘నేషనల్ హాలీడే’ ప్రకటించారు.
‘అలబాయ్’ శునకం రష్యాతో పాటు, ఇతర మధ్య ఆసియా దేశాలలో ఎక్కువగా కనిపిస్తుంది. అత్యంత ప్రాచుర్యం పొందిన జాతులలో ఇది ఒకటి. తుర్క్‌మెనిస్థాన్ దేశంలోనే కాకుండా, పొరుగు దేశాల్లోనూ శతాబ్దాల కాలం నుంచి శునకాలు, గుర్రాలను గౌరవించే సంప్రదాయం ఉంది. వాళ్లు తమ పశుసంపదతో పాటు, వీటినీ ప్రేమతో పెంచుకుంటారు. తుర్క్‌మెనిస్థాన్ అధ్యక్షుడు గుర్బంగులి ‘అలబాయ్’ జాతి కుక్కల మీద ఓ పాట రాయడంతో పాటు, ఒక పుస్తకాన్నీ వెలువరించాడు. 2017లో ఓ శునకాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్‌కు బహుమతిగా ఇచ్చాడు. గతేడాది ఆ దేశ రాజధాని నగర కూడలిలో బంగారు విగ్రహం పెట్టగా, తాజాగా ఏకంగా ఆ జాతి శునకాల గౌరవార్థం ఏప్రిల్ చివరి ఆదివారాన్ని నేషనల్ హాలీడేగా డిక్లేర్ చేశాడు. ఇదే రోజు స్థానిక గుర్రపు జాతిని స్మరించుకోవడంతో రెండు వేడుకలు ఘనంగా జరుపుకోవచ్చని ఆయన పేర్కొన్నాడు. ఆ రోజు డాగ్ బ్యూటీ అండ్ అగ్లీ కాంటెస్ట్‌లు నిర్వహిద్దామని గుర్బంగులి కుమారుడు, ఇంటర్నేషనల్ అలబాయ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెర్దార్ తెలిపాడు.