- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అందాల పోటీల్లో పాల్గొన్న గొర్రె పిల్లలు.. ఆ తర్వాత ఏమైందో తెలుసా?
దిశ, వెబ్ డెస్క్: బుజ్జి బుజ్జి గొర్రె పిల్లలు… వాటికి తగట్టు అందమైన బట్టలు వేసుకొని, ఆభరణాలను అలంకరించుకొని ర్యాంప్ వాక్ కి బయలుదేరాయి. తమ యజమానులతో కలిసి ర్యాంప్ పై హొయలు పోతూ నడిచాయి. వాటి నడకకు ఫిదా అయిన జడ్జ్ లు మొదటి బహుమతి , రెండో బహుమతి అంటూ అవార్డులను కూడా బహుకరించారు. అసలు ఏంటి ఇదంతా..గొర్రెలు ర్యాంప్ వాక్ చేయడమేంటి? వాటికి బహుమతులు రావడం ఏంటి అనేగా మీ డౌట్.. అయితే ఈ విషయం తెలియాలంటే టర్కీకి వెళ్లాల్సిందే.
మనం ఇప్పటివరకు ఎన్నో ఫ్యాషన్ షోలను చూసి ఉంటాం.. అందాల భామల ర్యాంప్ వాక్ లు.. అదరగొట్టే మోడళ్ల క్యాట్ వాక్ లు చూసి ఉంటాం. ఇక చెప్పాలంటే కుక్కలు. పిల్లుల ర్యాంప్ వాక్ లను చూసి ఉంటాం. కొన్ని గ్రామాల్లో ఎద్దుల పోటీలు, జల్లికట్టు ఇలా అనేక రకాల పోటీలు చూసి ఆనందించాం. కానీ టర్కీలో గొర్రె పిల్లల ర్యాంప్ వాక్ నిర్వహించారు. ఆగ్నేయ టర్కీ ప్రావిన్స్‌లోని దియార్‌బకీర్ అనే చోట జరిగిన ఈ అందాల పోటీల్లో దాదాపుగా రెండు డజన్ల గొర్రెలు పాల్గొన్నాయి. మళ్ళీ అలా, ఇలా కాదండి చక్కగా రెడీ అయ్యి డ్రెస్ లు, నగలు సింగారించుకుని మరీ పాల్గొన్నాయి. అయితే ఈ పోటీల వెనుక ఒక చక్కని ఉద్దేశం ఉంది. పశువుల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే గొర్రె పిల్లలను ర్యాంప్ వాక్ చేయించడానికి వాటి యజమానులు పడిన కష్టం నవ్వులు పూయిస్తుంది.
A beauty pageant for lambs: Turkey organized a catwalk for sheep to promote livestock breeding pic.twitter.com/2SFML228hH
— Reuters (@Reuters) March 31, 2021