- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ తుక్డే గ్యాంగ్ కు బుద్ధి చెబుతాం
by Shamantha N |
X
దిశ, వెబ్ డెస్క్ : దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు తుక్డే గ్యాంగ్ రైతుల ఆందోళనల్లో పాల్గొంటుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. బీహార్ రాష్ట్ర వ్యాప్త కిసాన్ చౌపల్ సమ్మేళన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.., మోడీ ప్రభుత్వం రైతుల్ని గౌరవిస్తుంది. అదే సమయంలో రైతుల ఆందోళనల్లో పాల్గొంటున్న తుక్డే గ్యాంగ్ పనిపడుతుందని హెచ్చరించారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే కుట్రతో ఢిల్లీ, మహరాష్ట్రల్లో అల్లర్లకు కారణమైనవారే ఇప్పుడు రైతుల ఆందోళనను ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికే కేంద్రం రైతులకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)తో పాటు మండి వ్యవస్థను కొనసాగిస్తామని స్పష్టం చేసినా.., కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్ధం కోసం రైతుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ మండిపడ్డారు.
Advertisement
Next Story