- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిరుమలపై కరోనా ప్రభావం
దిశ న్యూస్ బ్యూరో: కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ మధ్యాహ్నం టీటీడీ అధికారులు అత్యవసర సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమలకు భక్తులు వచ్చే రెండవ ఘాట్ రోడ్డును పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. వాహనాలను కొండపైకి అనుమతించడం లేదు. ఇప్పటికే అలిపిరి వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. అంతేకాదు.. నేటి సాయంత్రం నుంచి శ్రీవారి దర్శనానికి భక్తులను కూడా నిలిపివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. అయితే, శ్రీవారి మూలవరులకు నిర్వహించే సేవలను మాత్రం యథావిధిగా నిర్వహిస్తామని టీటీడీ తెలిపింది. కాగా, రేపు ఉదయం నుంచి రెండు ఘాట్ రోడ్డులు మూసివేస్తామని ప్రకటించింది. అటు తిరుమల కొండ మీద ఉన్న భక్తులను కూడా కిందకు పంపుతున్నారు.
tag: Corona Effect, TTD, key decision, TTD officials Emergency meeting, tirumala