- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TTD : శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్… ఆ దర్శనాలకు గ్రీన్ సిగ్నల్
దిశ, డైనమిక్ బ్యూరో : కరోనాతో మూతపడిన రంగాలన్నీ తెరుచుకుంటున్నాయి. ఆలయాల ద్వారా కరోనా అధికంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వాలు అన్ని ఆలయాల్లో దర్శనాలను సైతం నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే కరోనా తీవ్రత తగ్గడంతో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆలయాలను ఓపెన్ చేయగా.. తిరుపతిలో మాత్రం రూ.300 టికెట్ ఉన్నవారికే దర్శనం అనుమతి ఉండేది. అయితే ఇది తెలియక ఎందరో శ్రీవారి భక్తులు తిరుపతి వెళ్లి నిరాశతో వెనుతిరిగి రావాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలో భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమలలో సర్వదర్శనాలు పునఃప్రారంభానికి మళ్లీ అవకాశం కల్పించింది. రేపటి నుంచే సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ ప్రకటనలో పేర్కొంది. అయితే ముందుగా చిత్తూరు జిల్లా భక్తులకు అవకాశం కల్పించి తదుపరి అందరికీ అనుమతించే విధంగా టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ సర్వదర్శనం టికెట్లు తిరుపతి భూదేవి కాంప్లెక్స్ కౌంటర్లలో ఉదయం 6 నుంచి రోజుకు 2 వేల చొప్పున జారీ చేయనున్నారు.