ఏప్రిల్ 14 నుంచి తిరుమలలో ఆర్జిత సేవలు

by Hamsa |
ఏప్రిల్ 14 నుంచి తిరుమలలో ఆర్జిత సేవలు
X

దిశ వెబ్‌డెస్క్: ఏప్రిల్ 14 నుంచి తిరుమలలో ఆర్జిత సేవలకు అనుమతిస్తున్నట్లు టీటీడీ ఈవో కె.ఎస్. జవహర్ రెడ్డి వెల్లడించారు. అన్నమయ్య భవన్‌లో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వారికి ముందుగా అవకాశం ఇస్తామని, దర్శనానికి 72 గంటల ముందు చేయించుకున్న కరోనా నెగిటివ్ రిపోర్టు చేయిస్తేనే.. అర్జిత సేవల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తామన్నారు.

ఏప్రిల్ 15 నుంచి వయోవృద్ధులు, పిల్లల దర్శనాలను పునరుద్ధరిస్తున్నట్లు జవహర్ రెడ్డి పేర్కొన్నారు. ఇక కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గిన తర్వాత కరెంట్ బుకింగ్, లక్కీడిప్ విధానంలో ఆర్జితసేవా టికెట్ల విడుదలకు చర్యలు తీసుకుంటామని జవహర్ రెడ్డి తెలిపారు.

అటు ఫిబ్రవరిలో శ్రీవారిని 14.41 లక్షల మంది దర్శించుకుకోగా.. హుండీ ఆదాయం రూ.90.45 కోట్లు వచ్చిందన్నారు. ఇక తిరుపతి, తిరుమలలో మల్టీలెవర్ కార్ పార్కింగ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపిన ఆయన.. తిరుమలలోని రెండు ప్రదేశాల్లో వెయ్యి నుంచి 1500 కార్లు పట్టే మల్టీలెవల్ కార్ పార్కింగ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు.

Advertisement

Next Story

Most Viewed