- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాలి !
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో: టీచర్ల పదోన్నతులు, సాధారణ బదిలీలను వెంటనే చేపట్టాలని టీఎస్‌యూటీఎఫ్ కార్యవర్గ సమావేశం డిమాండ్ చేసింది. ఆదివారం యూటీఎఫ్ కార్యవర్గ సమావేశం వర్చువల్ పద్దతిలో జరగ్గా కె.జంగయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ గత ఆరేండ్లుగా పదోన్నతులు లేక అర్హతగల ఉపాధ్యాయులు నష్టపోతున్నారని తెలిపారు. పాఠశాలల్లో సుమారు 9వేల ఖాళీలు ఉన్నాయని దీంతో విద్యార్థులకు నష్టం జరుగుతుందన్నారు. తాత్కాలికంగా పాత పది జిల్లాల ప్రాతిపదికన యాజమాన్యం పదోన్నతులు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు పదేపదే కోరుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పాఠశాలలకు ఉపాధ్యాయులు హాజరవుతున్నా కనీసం గదులు ఊడ్చేవారే కరువయ్యారని, వెంటనే స్వచ్ఛ కార్మికులను నియమించాలని సమావేశం డిమాండ్ చేసింది.
Advertisement
Next Story