24న టీఎస్ఆర్టీసీ మెడికల్ బోర్డు మీటింగ్

by Shyam |

దిశ, న్యూస్ బ్యూరో: టీఎస్ఆర్టీసీ మెడికల్ బోర్డు సమావేశం శుక్రవారం జరగనుంది. కార్మికులు, కార్మిక సంఘాలు పదే పదే విజ్ఞప్తులు చేయడంతో మెడికల్ బోర్డు సమావేశం నిర్వహించాలని యాజమాన్యం నిర్ణయించింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ మీటింగ్‌లో పలువురు కార్మికుల అనారోగ్య సమస్యలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సమావేశంలో కార్మికులకు కరోనా సోకుతుండడం, దాని చికిత్స లాంటి అంశాలు చర్చకు వస్తాయా రావా అన్న అంశంపై యాజమాన్యం స్పష్టతనివ్వలేదు. కరోనా వ్యాప్తి నిరోధానికి మార్చి22 నుంచి అమలులోకి వచ్చిన పూర్తిస్థాయి లాక్‌డౌన్ సడలింపుల తర్వాత మే నెల 29వ తేదీ నుంచి రాష్ట్రంలోని జిల్లాల్లో బస్సులు రోడ్డెక్కిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి పరిపాలన విభాగం సిబ్బంది, కండక్లర్లు, డ్రైవర్లకు కలిపి ఇప్పటివకి 50 మందికిపైగానే ఆర్టీసీ ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. నలుగురు మృత్యువాత పడ్డారు. అయితే వీటిని అధికారికంగా యాజమాన్యం ధృవీకరించలేదు. కరోనా బారిన పడ్డ ఆర్టీసీ కార్మికులకు హైదరాబాద్‌లోని తార్నాకాలోని ఆర్టీసీ ఆస్పత్రిలో ఇప్పటిదాకా ఎలాంటి కొవిడ్ ప్రత్యేక వార్డును ఏర్పాటు చేయలేదని కార్మికులు, కార్మిక సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement

Next Story