- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానంలో చేరం
దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపైన ప్రభుత్వం పోస్టుల భర్తీ కోసం ఇచ్చే నోటిఫికేషన్లలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానంలో అయితే దరఖాస్తు చేసుకోవద్దని, రెగ్యులర్ ప్రాతిపదికన మాత్రమే ఆ పోస్టుల్ని భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. నర్సింగ్ ఆఫీసర్లు ఎవ్వరూ కూడా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానంలో ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్ల ద్వారా చేరవద్దని పిలుపునిచ్చింది.
ఇటీవల ఛెస్ట్ ఆసుపత్రిలో కరోనా కారణంగా చనిపోయిన నర్సు విక్టోరియా జయమణి కుటుంబానికి, కొత్తగూడెం జిల్లా పర్ణశాలలో మృతిచెందిన డాక్టర్ నరేష్ కుటుంబానికి తలా కోటి రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి జాయింట్ కలెక్టర్ పోస్టింగ్ ఇవ్వాలని, 500 గజాల స్థలాన్ని ప్రభుత్వం సమకూర్చాలని, వారిద్దరి పిల్లల సంరక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేసింది. కరోనాపై యుద్ధంలో అమరులైన డాక్టర్ నరేష్, నర్సింగ్ ఆఫీసర్ జయమణికి అశ్రునివాళి ఘటించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావాలని పిలుపునిచ్చింది.