- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లాసెట్ ఫలితాలు విడుదల
దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్ లాసెట్ ప్రవేశపరీక్ష-2021 ఫలితాలను బుధవారం హైదరాబాద్ లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి మాట్లాడుతూ.. మూడేండ్ల న్యాయ విద్య కోర్సుకు 28,877 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. ఇందులో 21,160 మంది ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. కాగా 14,017 మంది మాత్రమే కోర్సులో ప్రవేశాలకు అర్హత సాధించినట్లు తెలిపారు.
66.24 శాతం ఉత్తీర్ణత సాధించారని, ఐదేండ్ల న్యాయ విద్య (బీఏ, బీకాం, బీబీఏ, ఎల్‌ఎల్‌బీ) కోసం 7,644 మంది దరఖాస్తు చేయగా.. అందులో 5,793 మంది పరీక్షకు హాజరయ్యారన్నారు. పీజీ ఎల్‌సెట్ కు 3,284 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,676 మంది ప్రవేశ పరీక్షకు హాజరయ్యారని చెప్పారు. ఇందులో 2,535 మంది ప్రవేశాలకు అర్హత సాధించినట్లు వెల్లడించారు. లాసెట్‌తోపాటు పీజీఎల్ సెట్‌కు 39,805 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 29,629 మంది పరీక్షకు హాజరయ్యారని, ఇందులో 20,398 మంది అర్హత సాధించినట్లు తెలిపారు.