ఎంసెట్ ఇంజనీరింగ్ రెస్పాన్స్ షీట్ విడుదల

by Shyam |
ts eam cet
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎంసెట్ ఇంజనీరింగ్ రెస్పాన్స్ షీట్ ను విడుదల చేసినట్టుగా కన్వీనర్ గోవర్థన్ ప్రకటించారు. వీటితో పాటు మొత్తం ఆరు సెషన్లకు సంబంధించిన ప్రిమిలినరీ కీ, మాస్టర్ క్వషన్ పేపర్లను ను కూడా వెబ్ సైట్ లో పొందుపరిచామని తెలిపారు. ఈ నెల 12 నుంచి రెస్పాన్స్ షీట్ ను డౌన్ లోడ్ చేసుకోచ్చవని సూచించారు. ఈ నెల 12 నుంచి 14 సాయంత్రం 4 గంటల వరకు ప్రిమిలినరీ కీ అందుబాటులో ఉంటుందని తెలిపారు. విద్యార్థులు తమ అభ్యంతరాలను ఆన్ లైన్ ద్వారా మాత్రమే తెలియజేయాలని సూచించారు. ఇతర పద్దతుల్లో అభ్యంతరాలను తెలియజేస్తే స్వీకరించబోమని స్పష్టం చేశారు.

Advertisement

Next Story