- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tiktok డీల్‌కు సెప్టెంబర్ వరకు గడువు!
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్న ప్రముఖ యాప్ టిక్‌టాక్‌ను టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేయనుందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టిక్‌టాక్ సంస్థకు గడువును విధించారు. తమదేశంలో టిక్‌టాక్ కార్యకలాపాలను సెప్టెంబర్ 15లోగా విక్రయించాలని, ఆలోపు జరగకపోతే సంస్థను మూసేయాలని ఆదేశించారు.
అమెరికాలో ఉన్న టిక్‌టాక్ యాప్ కార్యకలాపాలను టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ కొనుగోలు చేయడం వల్ల ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం ఉండదని పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ కాకుండా ఏ ఇతర అమెరికన్ కంపెనీ కొనుగోలు చేసినా, చేతులు మారినా ఆ ఒప్పందం మొత్తంలోంచి కొంత అమెరికా ప్రభుత్వానికి చెల్లించాలని ట్రంప్ నిబంధన విధించారు.
కాగా, అమెరికాలో టిక్‌టాక్‌ను పూర్తిగా నిషేధం విధించనున్నట్లు గతవారం ట్రంప్ ప్రకటించిన అనంతరం.. టిక్‌టాక్ యాప్ భవిష్యత్తుపై సందిగ్ధత నెలకొంది. అయితే, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఆదివారం ట్రంప్‌తో చర్చించిన తర్వాత యాప్ భద్రత, పనితీరు విషయంపై, కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన అన్ని అంశాలను అమెరికా అధ్యక్షుడికి వివరించారు. ఈ క్రమంలోనే ట్రంప్ తాజా వ్యాఖ్యలు చేశారు.