ఈఎస్ఐ ఆసుపత్రి వద్ద కాల్పులు.. వ్యక్తి మృతి

by Sumithra |
ఈఎస్ఐ ఆసుపత్రి వద్ద కాల్పులు.. వ్యక్తి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : పట్టపగలే దేశ రాజధాని ఢిల్లీలో గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో రెచ్చిపోయారు. ఈఎస్ఐ ఆసుపత్రి వద్ద నడ్డిరోడ్డుపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ ట్రక్కు డ్రైవర్ మృతి చెందాడు. ఈ ప్రమాద ఘటనపై ప్రత్యక్ష సాక్షులను పోలీసులు విచారించారు. ఈ సందర్భంగా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని బసాయి దారాపూర్ ప్రాంతంలో ఉన్న ఈఎస్ఐ ఆసుపత్రి వద్ద గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ఓ కారులో వచ్చి ట్రక్కు ముందు ఆపారు.

అనంతరం ఇద్దరు వ్యక్తులు దిగి.. ట్రక్‌ డ్రైవర్‌ నడుం భాగంలో తుపాకీతో కాల్చారని తెలిపారు. అనంతరం మొబైల్‌ ఫోన్‌, రూ. 5వేల నగదును తీసుకొని పారిపోయారని వెల్లడించారు. అయితే కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తిని హర్యానా పాల్వాల్‌లోని గోరేకా మొహల్లా వాసి లఖ్మి చంద్‌ (50)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story