- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఆర్ఎస్ మండల కమిటీలు ఖరారు?
దిశ, కాటారం : తెలంగాణ రాష్ట్ర సమితి సంస్థాగత ఎన్నికల్లో భాగంగా గ్రామ కమిటీల ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు మండల శాఖ అధ్యక్ష పదవిపై నాయకులు దృష్టిసారించారు. కాటారం, మల్హర్ మండలాల్లో ఆశావహులు ఈ పదవి కోసం పోటీ పడుతున్నప్పటికీ మంథని టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి పెద్దపెల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టమధుకర్ అనుకూలమైన వ్యక్తులకే అధ్యక్ష పదవి లభించే అవకాశం ఉంది. ఇటీవలే కాటారం మనోహర్ మహదేవపూర్ మండలంలో పెద్దపల్లి ఎంపీ బోర్ల వెంకటేష్ తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కార్యకర్తలు నాయకుల నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు తెలుస్తోంది.
అధ్యక్షుల పేర్లు ఖరారు ?
టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులను ఏకగ్రీవంగా పేర్లు ఖరారు చేసినట్లు కార్యకర్తల ద్వారా అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎంపిక పూర్తి అయినట్లు తెలుస్తోంది. కాటారం మండలంలో టీఆర్ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ, అందరికీ అందుబాటులో ఉంటున్న కాటారం ఎంపీటీసీ తోట జనార్దన్ మండల అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. మల్హర్ రావు మండలానికి గతంలో పార్టీ అధ్యక్షునిగా పనిచేసిన వల్లం కుంట గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు తాజుద్దీన్ మహాదేవపూర్ మండలానికి శ్రీనివాసరావును ఇంటికి అయినట్టు తెలుస్తోంది. ఈ మేరకు అధికారికంగా సోమవారం లేదా మంగళవారం ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.