- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘మైనంపల్లిని ఏమైనా అంటే చెప్పుతో కొడుతాం’
దిశ, అల్వాల్: మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని టీఆర్ఎస్ మహిళా నేతలు హెచ్చరించారు. బీజేపీ నాయకురాలు ప్రసన్నకుమారి ఎమ్మెల్యే పట్ల అజ్ఞానంతో విమర్శలు చేస్తోందని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్న మైనంపల్లి హనుమంతరావుపై అవాక్కులు, చవాక్కులు చేస్తే చెప్పు దెబ్బలు తప్పవని టీఆర్ఎస్ మహిళ నేతలు ఘాటుగా స్పందించారు. ఈస్ట్ ఆనంద్ బాగ్‌లోని RU బ్రిడ్జి నిర్మాణం, మౌలాలి కమాన్ సమస్యలతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే మైనంపల్లి నిత్యం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాడని అన్నారు. అలాంటి ఎమ్మెల్యేపై బీజేపీ నాయకురాలు ప్రసన్న అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నియోజకవర్గంలోని నిరుపేదలకు ఆదుకునేందుకు మైనంపల్లి చేస్తోన్న స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు గుర్తుచేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మహిళా నేతలు వసంత, సుధ, బాయమ్మ, రజిత, వాణి, పద్మ, లావణ్య, గౌతమి, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.