టీఆర్ఎస్ వర్సెస్ కార్మిక సంఘాలు

by Shyam |
టీఆర్ఎస్ వర్సెస్ కార్మిక సంఘాలు
X

ధిశ, కరీంనగర్: ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు పేలుడు బాధిత కుటుంబాలకు పరిహారం అందించే విషయంలో ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు, రామగుండం ఎమ్మెల్యే కోరుకుంటి చందర్.. గోదావరిఖని ఆర్జీ1 జీఎం కార్యాలయానికి చేరుకుని బాధిత కుటుంబాలు, కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపగా విఫలమయ్యాయి. ఈ సమయంలో జీఎం కార్యాలయ ఆవరణలోనే ఉన్న టీఆర్ఎస్ నాయకులకు, కార్మిక సంఘాల నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కమాన్ పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్ హెచ్ఎంఎస్ నాయకుల తీరుపై మండిపడ్డారు. కోట్ల రూపాయలు డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పొరుగు రాష్ట్రాల్లో ఇచ్చినట్టుగానే ఇక్కడ కూడా ఇవ్వాలని అడుగుతున్నామని హెచ్ఎంఎస్ నాయకుడు రియాజ్ అన్నారు. నువ్వెవరు ఇక్కడ మాట్లాడడానికి అని సత్యనారాయణను ప్రశ్నించడంతో నువ్వెవరు నీకేం పని అంటూ గొడవకు దిగారు. ఓ వైపు పోలీసులు వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్తున్నా వినకుండా టీఆర్ఎస్ నాయకులు.. హెచ్ఎంఎస్ నాయకులు వాగ్వాదానికి దిగడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed