- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టీఆర్ఎస్ సంచలన నినాదం.. హుజురాబాద్‌లో గెలుపు ఖాయమేనా..?
దిశ ప్రతినిధి, కరీంనగర్: అభ్యర్థుల గెలుపునకు కొన్ని కొన్ని విధానాలు, నినాదాలు కీలకంగా పనిచేస్తాయి. ఓటర్ల గుండెల్లోకి చొచ్చుకపోయే విధంగా ప్రచారం చేయడం వల్ల అంచనాలు తారు మారు అవుతుంటాయి. సమాజం అంతా బిగ్ షాట్‌గా చూసే వ్యక్తిని తక్కువ చేయాలన్న తలంపుతో చేపట్టే ప్రచారం ఓటర్లను ఆకట్టుకుని గెలుపు ఓటములను శాసించే పరిస్థితి ఉంటుంది. సరిగ్గా ఇదే పద్దతిని ఫాలో అవుతోంది అధికార టీఆర్‌ఎస్ పార్టీ. అసామన్యునిపై సామన్యున్ని బరిలో నిలిపి సాహసం చేయడమే కాదు సక్సెస్ సాధించిన చరిత్రను కూడా సొంతం చేసుకుంది గులాబీ పార్టీ. ఇప్పుడు ఇదే ఎత్తుగడను హుజురాబాద్‌లో అమలు చేయబోతున్న టీఆర్ఎస్ పార్టీ.. సీనియర్ పై జూనియర్‌ను బరిలో నిలిపినట్టుగా అర్థం అవుతోంది.
2014లో..
మట్టి వాసనకు, అత్తరు వాసనకు, కోట్లకు పడగలెత్తిన వ్యక్తికి, కోర్టు కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తికి మధ్య పోరాటం అన్న నినాదాన్ని వినిపించారు బాల్క సుమన్. 2014 లోకసభ ఎన్నికల్లో పెద్దపల్లి నుండి పోటీ చేసిన బాల్క సుమన్ బలమైన ప్రత్యర్థిగా ఉన్న జి వివేక్‌ను ఓడించేందుకు ఎత్తుకున్న నినాదమిది. ఈ నినాదం గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపిందని చెప్పాలి. ఏడు సెగ్మెంట్లలోనూ తండ్రి వెంకటస్వామి, తనయుడు వివేక్‌లకు వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి. వెంకటస్వామి కుటుంబానికి పెద్దపల్లి లోకసభ స్థానం పెట్టని కోటగా మారింది. బలంగా ఉన్న వివేక్‌ను బాల్క సుమన్ మట్టి కరిపిస్తాడా అన్న చర్చ కూడా సాగింది. కానీ అనూహ్యంగా ఆయన ఎత్తుకున్న నినాదమే సుమన్ గెలుపునకు మూల కారణమైంది.
ఇప్పుడు హుజురాబాద్ ఎన్నికల్లోనూ అదే పరిస్థితిని పునరావృతం కానునన్నట్టు స్పష్టం అవుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను ప్రకటించిన తరువాత ఇల్లందకుంటలో ఏర్పాటు చేసిన ఆశీర్వాద సభలో మంత్రి హరీష్ రావు ఇచ్చిన నినాదమే ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. 2 గుంటలు లేని వ్యక్తికి 200 ఎకరాలున్న అభ్యర్థికి మధ్య పోటీ జరుగుతోందని మంత్రి హరీష్ ఇచ్చిన నినాదంతోనే ప్రజల్లోకి టీఆర్ఎస్ పార్టీ వెళ్లనున్నట్టు స్పష్టం అవుతోంది. అంతేకాకుండా దాదాపు 150కిపైగా ఉద్యమ కేసులు ఉన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను బరిలో నిలిపి ఈటలపై ఉన్న కేసులకన్నా గెల్లుపై ఉన్న కేసులే ఎక్కువ అన్న ప్రచారం కూడా చేయనున్నారు. పేదోడికి ధనికుడికి మధ్య జరుగుతున్న ఎన్నికలు అన్న సంకేతాలతో పాటు అన్ని కోణాల్లోనూ ప్రత్యేకంగా నినాదాలు సిద్ధం చేసిన టీఆర్ఎస్ వాటినే ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయనుంది. ఈ నినాదాల ప్రచారం వల్ల నియోజకవర్గంలో ఉన్న ఈటల అనుకూలతకు పూర్తి స్థాయిలో చెక్ పెట్టాలని యోచిస్తోంది. అలాగే బీసీ అయిన ఈటలపై బీసీ క్యాండెట్‌ను పోటీ చేయిస్తోంది టీఆర్ఎస్ పార్టీ.
సీనియర్ వర్సెస్ జూనియర్
పెద్దపల్లి లోకసభ ఎన్నికల ఎత్తుగడ మాదిరిగానే హుజురాబాద్‌లో జూనియర్‌ను రంగంలోకి దింపింది టీఆర్ఎస్ అధిష్టానం. సీనియర్ ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెల్చిన ఈటల రాజేందర్ పై విద్యార్థి సంఘ నాయకున్ని పోటీ చేయించి సక్సెస్ కావాలన్న వ్యూహంతో ముందుకు సాగుతోంది. అయితే పెద్దపల్లిలా హుజురాబాద్‌లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందా లేదా అన్న విషయం తేలాలంటే ఎన్నికల ఫలితాల వరకూ వేచి చూడక తప్పదు.