టీఆర్ఎస్‌కు భారీ షాక్.. కాంగ్రెస్‌లోకి సీనియర్ నేత

by Aamani |   ( Updated:2021-10-11 00:04:38.0  )
టీఆర్ఎస్‌కు భారీ షాక్.. కాంగ్రెస్‌లోకి సీనియర్ నేత
X

దిశ, మంచిర్యాల: జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్‌కు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బత్తుల వెంకటేశ్ ఏఐసీసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనకు ప్రేమ్ సాగర్ రావు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ.. గత 25 సంవత్స‌రాలుగా ఎమ్మెల్యే దివాకర్ రావు వెన్నంటే ఉండి కార్యకర్తగా సేవ చేస్తే కనీస గుర్తింపు ఇవ్వలేదన్నారు. ఎలాంటి పదవి ఆశించకుండా తాను పార్టీలో ఉంటే రాజీవ్ నగర్ అభివృద్ధికి, పట్టణ అభివృద్ధికి పని చేయకపోవడంతో విరక్తి చెందినట్లు ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలో ప్రేమ్ సాగర్ రావు చేస్తున్న ప్రజా సేవా కార్యక్రమాలకు ఆకర్షితుడినై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన వెల్లడించారు. అనంతరం ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో కష్టపడే కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇస్తానని, వెంకటేశ్‌కు పార్టీలో తగిన గుర్తింపు ఉంటుదని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి చిట్ల సత్య నారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, దండేపల్లి జెడ్పీటీసీ గడ్డం నాగరాణి త్రిమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story