- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిండుకోని సభాస్థలి.. పాసుల కోసం ప్రజాప్రతినిధుల పడిగాపులు
దిశ, శేరిలింగంపల్లి: టీఆర్‌ఎస్ పార్టీ సభలు, సమావేశాలు అంటేనే జనాలు హోరెత్తుతారు. పార్టీ శ్రేణులు హడావుడి చేస్తుంటారు. కానీ ద్విదశాబ్ది వేడుకల్లో మాత్రం అంతగా హడావుడి కనిపించలేదు. అట్టహాసంగా చేస్తున్నట్లు హడావుడి చేసినా.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం మొదలైనా.. జనాలు వస్తున్నా.. సభస్థలి వెనకాల మొత్తం ఖాళీగానే ఉంది. అటు వీఐపీల గ్యాలరీలో చాలా కుర్చీలు ఖాళీగానే కనిపించాయి. దీంతో పోలీసులు సభకు వచ్చిన మహిళలకు వీఐపీల గ్యాలరీలోకి అనుమతించి దాన్ని నింపే ప్రయత్నం చేశారు.
పాస్‌లతో ఇబ్బందులు
ప్లీనరీకి రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు పాసుల కోసం అనేక ఇబ్బందులు పడ్డారు. ఓవైపు కేసీఆర్ స్పీచ్ కొనసాగుతుండగా ఎంట్రన్స్ వద్ద మాత్రం పాసులు రాక ఆయా జిల్లాల ప్రజా ప్రతినిధులు పడిగాపులు కాస్తున్నారు. ఎంతో దూరం నుండి వచ్చినా ఇక్కడ పాసులు ఇస్తారని చెప్పి ఇవ్వలేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.