ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ కు భారీ షాక్

by Sridhar Babu |
ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ కు భారీ షాక్
X

దిశ,పాలేరు: నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, పాలేరు గ్రామ మాజీ సర్పంచ్ రామ సహాయం మాధవి రెడ్డి నేడు కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారు. దీనికి సంబంధించి నియోజకవర్గం నుంచి భారీ కాన్వాయ్ నడుమ వందలాది మంది అనుచరులతో హైదరాబాద్ గాంధీభవన్ కి వెళ్తున్నారు. అక్కడ టీపీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్, సీఎల్పీ నేత భట్టి, మాజీ మంత్రి సంభాని ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొనున్నారు. ఆమె చేరికతో కాంగ్రెస్ పార్టీలోని అనుచరులకు నూతన ఉత్తేజం వచ్చినట్లైది. అధికార పార్టీకి ఇది మింగుడు పడని విషయంగా పరిణమించింది. పాలేరు ఎమ్మెల్యే వర్గ పోకడలతో మాధవిరెడ్డి అనుచరుల అసంతృప్తి నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

Advertisement

Next Story