కేంద్రమంత్రి నాకు స్పష్టమైన హామీ ఇచ్చారు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే

by Sridhar Babu |
కేంద్రమంత్రి నాకు స్పష్టమైన హామీ ఇచ్చారు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే
X

దిశ‌, అబ్దుల్లాపూర్‌మెట్‌: కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గంగాపురం కిషన్‌రెడ్డిని ఇబ్రహీంప‌ట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిష‌న్‌రెడ్డి క‌లిశారు. ఇబ్రహీంప‌ట్నం పెద్ద చెరువును ప‌ర్యాట‌క ప్రాంతంగా, రాచ‌కొండ ప్రాంతాన్ని సాంస్కృతిక ప‌ర్యాట‌క క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు చొర‌వ తీసుకోవాల‌ని కోరారు. దీనికి కేంద్రమంత్రి కిష‌న్‌రెడ్డి సానుకూలంగా స్పందించార‌ని ఎమ్మెల్యే మంచిరెడ్డి తెలిపారు. రాచ‌కొండ అభివృద్ధికి స‌మ‌గ్ర నివేదిక రూపొందించాల‌ని కేంద్ర పురావ‌స్తుశాఖ అధికారుల‌కు ఆదేశాలిస్తామ‌న్నారు. ఇబ్రహీంప‌ట్నం పెద్ద చెరువును ప‌ర్యాట‌క ప్రాంతంగా, మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తాన‌ని కేంద్రమంత్రి కిష‌న్‌రెడ్డి హామీ ఇచ్చిన‌ట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిష‌న్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story