- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆధిపత్యం కోసమే కాంగ్రెస్ నాయకుల ఆందోళనలు
దిశ, మేడ్చల్: కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధిపత్య కోసమే ఆందోళన చేశారని టీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ (రాజు) అన్నారు. మండలంలోని గౌడవెల్లిలో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డిపై అసత్య ప్రచారాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి మంత్రి మల్లారెడ్డి సుమారు రెండు గంటలకు పైగా సమయం కేటాయించారని, కానీ కొంతమంది నాయకులు కావాలని మంత్రిపై బురద చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
అంతేకాకుండా గ్రామ సమస్యలపై వచ్చిన వినతులను స్వీకరించారని, వాటిని త్వరలో పరిష్కరిస్తామని కూడా హామీ ఇచ్చారని శ్రీనివాస్ తెలిపారు. మంత్రి మల్లారెడ్డి చేసే అభివృద్ధిని చూసి తట్టుకోలేకే కొంతమంది స్వార్ధ నాయకులు ఆయన సభ నుండి వెళ్లిపోయాక గొడవ చేసిన వీడియోలు తీసి మంత్రిని అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. మంత్రి మల్లారెడ్డిపై అసత్య ప్రచారాలు ఆపకపోతే రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతామని శ్రీనివాస్ హెచ్చరించారు.